LIVE
SUSMITHA
వెనక్కి
Entertainment

మెగాస్టార్ పై కూతురు సుస్మిత ఎమోషనల్ పోస్ట్

40 రోజుల క్రితం
సారాంశం

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రిపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. చిరంజీవి తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు బదులిస్తూ ఆమె పంచుకున్న ఈ సందేశం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. “డాడీ, థ్యాంక్యూ. రెండేళ్ల పాపగా మీ చేయి పట్టుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నేను, ఇప్పుడు మీ నిర్మాతగా మారడం నా జీవితనికి ఓ అద్భుతమైన వరం. నాకు ఒకే వ్యక్తిలో తండ్రి, గురువు, నిజ జీవిత హీరో, మెగాస్టార్.. అన్నీ మీరే. ఇంతకంటే నేనేం కోరుకోగలను? మీ విషెస్‌కి థ్యాంక్యూ. ఎప్పుడూ మీలాగే ఉన్నందుకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్వేస్” అంటూ సుస్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత, తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రిపై సుస్మిత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షేర్ చేయండి:
10 మార్చి, 2026 06:35 PMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

9 గంటల క్రితం
మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

9 గంటల క్రితం
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

విష్ణు ప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో నటి అనన్య నాగళ్లపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి. వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఫీచర్ గురించి, దీంతో కలిగే ప్రయోజనాల గురించి తాను 2025లోనే క్లారిటీ ఇచ్చానని అనన్య గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కేవలం విమర్శల కోసమే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

11 గంటల క్రితం
పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.

11 గంటల క్రితం